ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల ఎండలు దంచికొడుతుండగా.. మరికొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో వాతావరణ పరిస్థితులపై విపత్తుల నిర్వహణ సంస్థ అప్ డేట్ ఇచ్చింది. మరో మూడు రోజులు ఏపీలో విభిన్న వాతావరణం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల శని, ఆదివారం పిడుగులతో కూరిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. సోమవారం కూడా పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.