ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్. లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మెుత్తం 2,764 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.28.50 కోట్లు జమ చేశారు. 99 రోజుల కార్యక్రమం మొదటి వారం రోజుల్లోనే బిల్లులు క్లియర్ చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం తెలిపారు. కాగా, ఏఫ్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మెుదలు కానుంది.