Applications for new ration cards in Andhra Pradesh from December 2: ఏపీలోని పేద ప్రజలకు తీపికబురు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా రేపు (డిసెంబర్ 2) నుంచి కొత్త రేషన్ కార్డులు కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం వాటిని పరిశీలించి సంక్రాంతి లోపు అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు. కొత్త డిజైన్లతో, రాజముద్రతో రేషన్ కార్డులు ఉండనున్నాయి.