Andhra Pradesh Govt Cancelled Special Enforcement Bureau: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను రద్దు చేసింది. ఈ మేరకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీచేశారు. సెబ్‌కు కేటాయించిన ఉద్యోగులను ఎక్సైజ్ శాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో సెబ్ ఏర్పాటు కోసం జారీ చేసిన 12న జీవోలను సైతం ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో ఎక్సైజ్ శాఖ గతంలో తరహాలోనే పూర్తి స్థాయిలో పనిచేయనుంది.