SCR Helpline Numbers: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందులోనూ విజయవాడలో వర్షం దంచి కొడుతోంది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో.. విజయవాడ మొత్తం వరద నీటితో మునిగిపోయింది. నగరంలో జనజీవనం మొత్తం స్తంభించి పోయింది. భారీ వర్షాల నేపథ్యంలో.. ఏపీలో పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు విజయవాడ డీఆర్ఎం ప్రకటించారు. ఈ మేరకు.. ఏఏ సర్వీసులు రద్దు చేస్తున్నారో జాబితాను విడుదల చేశారు. హెల్ప్‌లైన్ నెంబర్లను కూడా ప్రకటించారు.