AP Rains: ఏపీలో విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కనిపిస్తోంది. సాయంత్రానికి వాతావరణం మారిపోయి దట్టమైన మేఘాలతో చల్లగా ఉంటోంది. అయితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెబుతుననారు. కొన్ని ప్రాంతాల్లో ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు.