ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాలలో వానలు కురుస్తున్నాయి. శుక్రవారం కూడా ఉత్తరాంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. ప్రస్తుతం అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరంవైపు కదులుతున్నట్లు తెలిపారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.