హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అధికారులు భారీ శుభవార్త చెప్పారు. ఆస్తి పన్ను చెల్లింపులకు సంబంధించి కీలక ప్రకటన వెలువరించారు. ఈనెల 31 లోపు ఆస్తి పన్ను చెల్లించే వారికి.. ఆస్తి పన్నుపై ఉన్న వడ్డీలో 90 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఆస్తి పన్ను బకాయిలను చెల్లించాలని సూచించారు. గడువు దాటిన తర్వాత పూర్తి వడ్డీని వసూలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.