ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలలో వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలలో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే మిగతా జిల్లాలలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.