ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజులు వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. బుధవారం రాత్రికి తుపానుగా బలపడనుంది. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. కోస్తాంధ్ర జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రాయలసీమలో భారీ వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ అంచనా వేశారు. నవంబర్ 29 (శుక్రవారం) నెల్లూరు, ప్రకాశంతో పాటుగా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వానలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.