ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గజ్జెల వెంకట లక్ష్మికి ప్రభుత్వం మెమో జారీ చేసింది. గజ్జెల లక్ష్మి పదవీకాలం ముగిసినట్లు తెలిపింది. మంగళవారం ఏపీ స్త్రీ శిశు సంక్షేమశాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గజ్జెల లక్ష్మి బుధవారం ఉదయం ప్రకటించారు. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గత నెల 25తోనే ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవీ కాలం పూర్తైనట్లు తెలిసింది. వాసిరెడ్డి పద్మ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఈ ఏడాది మార్చిలో గజ్జెల వెంకట లక్ష్మిని అప్పటి వైసీపీ ప్రభుత్వం నియమించింది.