తిరుమల లడ్డూ వ్యవహారంలో కల్తీ నెయ్యి సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డెయిరీలో తమిళనాడు ప్రభుత్వం సోదాలు నిర్వహించింది. తమిళనాడులోని ఏఆర్ డెయిరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మరోవైపు పళణి సుబ్రమణ్యం స్వామి పంచామృతంలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడారంటూ జరుగుతున్న ప్రచారంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. ఇలాంటి వదంతులు నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేసింది.