వరదలతో అతలాకుతలమైన విజయవాడను ఆదుకునేందుకు పలు చేతులు ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు తమకు చేతనైన సాయం చేస్తున్నాయి. వరదలలో సర్వం కోల్పోయిన వారి ఆకలి తీరుస్తూ బాసటగా నిలుస్తున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యకర్తలు వంద మంది ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. విజయవాడ హోటల్స్ అసోసియేషన్‌తో కలిసి రోజూ లక్షన్నర ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. తాగునీరు, ఆహారం అందిస్తూ అన్నార్థుల ఆకలి తీరుస్తున్నారు.