హైదరాబాద్‌లో నగరంలో సరికొత్త ఏటీఎం మోసాలు వెలుగుచూస్తున్నాయి. యూపీ, బీహార్ ముఠా టేప్‌తో డబ్బును నిలిపివేసి, నకిలీ కీలతో తెలివిగా కొట్టేస్తున్నారు. కస్టమర్లకు మెసేజ్‌లు వచ్చినా డబ్బులు మాత్రం అందడం లేదు. ఈ మేరకు ఎస్‌ఆర్‌నగర్‌లో బాధితులు ఫిర్యాదు చేయగా... తిరుమలగిరి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.