Auto Drivers Welfare Board: ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో సంక్షేమ బోర్డు, మంత్రుల కీలక ప్రకటన

2 hours ago 2
Telangana Auto Drivers Welfare Board: ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజాభవన్‌లో ఆటో సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో వారి సమస్యలపై చర్చించారు. ఆటో ఛార్జీలను కిలోమీటర్‌కు రూ.14కు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. రవాణా రంగంలో సుమారు 20 లక్షల కార్మిక కుటుంబాలు ఉన్నాయని భట్టి పేర్కొన్నారు. బోర్డు ఏర్పాటుపై ఇప్పటికే క్యాబినెట్‌లో చర్చ జరిగిందని, చట్టసభల ప్రక్రియ, నిధుల కేటాయింపు అనంతరం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
Read Entire Article