Telangana Housing: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పేదల కోసం రూ.300 కోట్లతో 5 వేల ఇళ్లు నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తాన్లా ఫౌండేషన్ సహకారంతో చేపట్టనున్న ఈ నిర్మాణాలకు దసరా రోజున గంగారంలో భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. ఏడాదిన్నరలో ఇళ్లను పూర్తి చేసి సీఎం రేవంత్‌రెడ్డితో ప్రారంభిస్తామని చెప్పారు. గంగారంలో 20 ఎకరాల్లో ఆసుపత్రి నిర్మించి పేదలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోనూ ఫౌండేషన్ రూ.70 కోట్లతో ఆసుపత్రిని నిర్మించి ప్రభుత్వానికి అందించనుందని మంత్రి తెలిపారు.