తెలుగు రాష్ట్రాల్లో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఏపీలోని పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ సోకి ప్రాణాలు వదలిన విషయం అందరినీ కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ పౌల్ట్రీ ఫాంలో నాలుగు రోజుల క్రితం వేల సంఖ్యలో కోళ్లు మరణించగా.. శాంపిల్స్ సేకరించి పరీక్షించగా బర్డ్ ఫ్లూ అని తేలింది.