Bolisetty Srinivas Comments on Allu Arjun: పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ యవ్వారం.. సోషల్ మీడియా దాటి రాజకీయాల వరకూ చేరింది. తాజాగా అల్లు అర్జున్ మీద జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నారని తనకు తెలియదని.. ఉన్నది మెగా ఫ్యాన్స్ మాత్రమేనంటూ ఆయన అన్నారు. అలాగే నాకిష్టమైతేనే వస్తానంటే.. ఇక్కడ ఎవ్వరూ రమ్మని అడగలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.