ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. విదేశీ పర్యటన పూర్తి చేసుకుని తిరిగొచ్చిన చంద్రబాబు.. మంగళవారం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయెల్, సీఆర్ పాటిల్, అర్జున్ రామ్ మేఘవాల్‌లతో చంద్రబాబు భేటీ అయ్యారు. పెండింగ్ ప్రాజెక్టులు, కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది.