ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు ఏపీవ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరిగాయి. టీడీపీ శ్రేణులు, నాయకుల ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే తిరుపతిలో చంద్రబాబు బాల్యమిత్రులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. అనంతరం చంద్రబాబుతో తమ బాల్యస్మృతులను గుర్తు చేసుకున్నారు.