ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పోలవరంలో పర్యటించారు. నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం ఇస్తానన్నారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక పైసా కూడా విదల్చలేదని విమర్శించారు. వరదలు వస్తే పట్టించుకోలేదన్నారు. రైతులు త్యాగాలు చేసి మరీ పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చారని అన్నారు. వీలైనంత త్వరగా నిర్వాసితులకు పరిహారం ఇస్తామని తెలిపారు, 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తామని అన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీని గెలిపించి ఉంటే పోలవరం నిర్వాసితులు ఇప్పటికి సెటిల్ అయ్యేవారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.