Chandrababu: ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌లో రహస్య కెమెరాలు పెట్టిన ఘటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు.. ప్రతీ 3 గంటలకు ఒకసారి ఈ విచారణకు సంబంధించి వివరాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.