గత కొన్ని రోజులకు చికెన్ జోలికి వెళ్లాలంటేనే జనాలు వణికిపోయారు. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ ముట్టుకోవాలంటే భయపడిపోయారు. దీంతో చికెన్ ధరలు అమాంతం తగ్గిపోయాయి. చికెన్ వ్యాపారస్థులు తీవ్రంగా నష్టాలను కూడా చూశారు. వైద్య నిపుణులు చికెన్‌ను బాగా ఉడికించి తింటే ఎలాంటి సమస్య ఉండదని చెప్పినా.. జనాలు వినలేదు. మనకెందుకులే అని చికెన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. హోటల్స్, రెస్టారెంట్లో మాత్రం చికెన్ డిమాండ్ తగ్గలేదు.. వాటిని తినేవాళ్లు తినేశారు.