అలా అయితేనే సిలిండర్.. గ్యాస్ బుకింగ్‌పై ఏపీ ఆర్థిక మంత్రి కీలక ప్రకటన

5 months ago 22
గ్యాస్ బుకింగ్‌పై ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక సూచనలు చేశారు. గ్యాస్ బుకింగ్ ఆన్‌లైన్ పద్ధతిలోనే జరగాలని.. ఓటీపీ చెప్తేనే గ్యాస్ సిలిండర్ డెలివరీ ఉంటుందని స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్లను ప్రాధాన్య క్రమంలో గృహాలు, ఆస్పత్రులు, హాస్టళ్లకు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
Read Entire Article