Pawan kalyan on Bengaluru Chinnaswamy Stadium Stampede: ఆర్సీబీ సంబరాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. బాధితులు త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.