మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి చేరారు. ఈ రోజు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవికి గిన్నిస్ సర్టిఫికేట్ అందజేశారు. ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ గిన్నిస్ అవార్డును చిరంజీవికి అందజేశారు.