Chittoor: ముగ్గురు పిల్లల ప్రాణం తీసిన ఈత సరదా

9 months ago 13
వేసవి సెలవుల్లో పిల్లల ఈత సరదా వారి ప్రాణాల మీదకు తెస్తోంది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి. కోట వద్ద గురువారం మధ్యాహ్నం విషాద ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు చెరువులో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. వి.కోట మండలం మోట్లపల్లిలో పూర్ణేష్, జగన్, నిఖిల్, కుషాల్ అనే నలుగురు పిల్లలు సెలవులు కావడంతో గ్రామం సమీపంలోని చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. పూర్ణేష్ మినహా మిగతా ముగ్గురు పిల్లలు నీటిలోకి దిగారు. కొద్దిసేపటికి వారంతా నీటిలో మునిగిపోయారు. సరిగా ఈత రాకపోవడంతో అందులో దిగిన కుషాల్, జగన్, నిఖిల్‌ మునిగిపోయారు. పూర్ణేష్‌ చెట్టు తీగల సాయంతో వారిని కాపాడటానికి యత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో సమీపంలో ఇంటి నిర్మాణం చేపడుతున్న కార్మికులకు చెప్పగా వారు వచ్చారు. కానీ, అప్పటికే కుషాల్, నిఖిల్‌ మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న జగన్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Read Entire Article