తిరుమలలో కొత్త మోసం వెలుగు చూసింది. సుప్రభాత సేవ పేరుతో 60 మంది భక్తుల నుంచి సుమారుగా రూ.3.60 లక్షలు వసూలు చేశాడో దళారి. ఒక్కొక్కరి నుంచి 6 వేలు వసూలు చేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి.. టీటీడీ ఉద్యోగుల సిఫార్సు లేఖలంటూ జూన్ 23వ తేదీకి కొన్ని లేఖలను వారికి అందించారు. అయితే జూన్ 22వ తేదీ మధ్యాహ్నం నుంచి అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని భక్తులు వాపోతున్నారు. దీనిపై పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్, పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.