పోలీసు అధికారి భార్య కవితా రెడ్డి, బంగారం, గ్రానైట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి అధిక వడ్డీ ఇస్తానని చెప్పి ఎంతోమందిని మోసం చేసింది. బాధితులు డబ్బులు అడిగితే బెదిరించింది. ఆటో డ్రైవర్ నుంచి రూ.30 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు.. హయత్‌నగర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నాగోల్‌లో బోటిక్ వ్యాపారం ప్రారంభించిన ఆమె ఎందరో వినియోగదారులను మోసం చేసినట్లు సమాచారం. కవితా రెడ్డి చేతిలో మోసపోయిన వారి సంఖ్య భారీగానే ఉంటుందని తెలుస్తోంది.