Andhra Pradesh Cyclone Dana: బంగాళాఖాతంలో దానా తుఫాన్ తీవ్రత పెరిగింది. ఇవాళ తీవ్ర తుఫాన్‌గా మారి.. ఒడిశాలోని పూరీ, పశ్చిమబెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి మధ్యలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోగా తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఏపీపై ఈ తుఫాన్ ప్రభావం పాక్షికంగా ఉంటుందంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు.