బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ప్రభావంతో తెలంగాణలో నేటి (సోమవారం) నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. మంగళవారం ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. బుధవారం 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉండగా, గురువారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.