పింఛన్ డబ్బులతో పరారైన పల్నాడు జిల్లా దాచేపల్లి వెల్ఫేర్ అసిస్టెంట్ సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. ఆన్ లైన్ బెట్టింగ్‌లలో మోసపోయానన్న వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీ ప్రసాద్.. తనకు ఒక్క అవకాశం ఇస్తే.. నెలరోజుల్లో డబ్బులు చెల్లిస్తానంటూ వీడియోలో వేడుకున్నారు. ఆన్ లైన్ బెట్టింగులతో మోసపోయానని.. తన కుటుంబం, పిల్లలు రెండు రోజులుగా ఏమీ తినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, దాచేపల్లి కమిషనర్ తనను క్షమించాలని నెలరోజుల్లో డబ్బులు చెల్లిస్తానంటూ కుటుంబంతో కలిసి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దీనిపై నారా లోకేష్ స్పందించారు.