Andhra Pradesh Day With CBN: డే విత్ సీబీఎన్ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం శ్రమించిన వారిలో అత్యుత్తుమ ప్రతిభ కనబరిచిన వారి కోసం టీడీపీ ‘డే విత్ సీబీఎన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా స్వీడన్ ఎన్నారై నవీన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉన్నారు. సీఎం నిర్వహించే సమావేశాల్లో, వివిధ చర్చల్లో పాల్గొన్నారు. నవీన్ తనకు ఇచ్చిన ఈ అద్భుత అవకాశానికి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.