Kalvakuntla Kavitha Bail: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నెలల తరబడి పోరాటం చేసినా బెయిల్ దొరకకపోగా.. సుమారు 17 నెలల తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ దొరకగా.. ఇప్పుడు ఇదే కేసులో నిందితునిగా ఉన్న అభిషేక్ బోయినపల్లికి భారీ ఊరట లభించింది. ఇప్పటికే బెయిల్ మీద బయటికొచ్చిన అభిషేక్ బోయినపల్లికి.. సుప్రీం కోర్టు మరో రెండు వారాల పాటు బెయిల్‌ను పొడిగిస్తూ తీర్పునిచ్చింది.