Kavitha Custody Extended: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయి.. జ్యుడీషియల్ ఖైదీలుగా తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది. మరోసారి వీళ్లిద్దరి రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది. ఈసారి ఏకంగా 20 రోజుల పాటు రిమాండ్‌ను పొడిగిస్తూ.. రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో.. సెప్టెంబర్ 02వ తేదీ వరకు ఇద్దరూ జైలులోనే ఉండనున్నారు.