Deputy CM: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం నిర్వహించే కొన్న సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయని ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ విమర్శలు, ఊహాగానాలకు తెరదించుతూ.. తాను ఎందుకు సమావేశాలకు రావడం లేదో పవన్ కళ్యాణ్ వెల్లడించారు.