Deputy CM: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే పంచాయతీ రాజ్ శాఖ నిధులు విడుదల చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాబోతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. ఏ పంచాయతీకి వచ్చిన నిధులను ఆ పంచాయతీ అభివృద్ధికే వినియోగించాలని సూచించారు.