Deputy CM: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఇప్పటికే వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు ప్రకటించగా.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో వరదలు, భారీ వర్షాలకు దెబ్బతిన్న 400 గ్రామ పంచాయతీలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు.