Digital Arrest: పోలీసులు చెప్పినా వినని రిటైర్డ్ ఉద్యోగి, రూ.49 లక్షలు పోగొట్టుకుని మళ్లీ స్టేషన్‌కు..

2 weeks ago 4
ప్రస్తుత రోజులలో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఛాన్స్ దొరికితే చాలు అకౌంట్లో డబ్బులు ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఓ రిటైర్డ్ ఉద్యోగికి ఈడీ అధికారుల పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీపై కేసు నమోదైందని.. మాఫీ చేయాలంటే రూ.72.50 లక్షలు పంపాలని బెదిరించారు. దీనిపై ఆరా తీసిన పోలీసులు.. అలాంటిదేమీ లేదంటూ సదరు రిటైర్డ్ ఉద్యోగికి భరోసా కల్పించారు. డిజిటల్ అరెస్ట్ మీద అవగాహన కల్పించారు. అయితే 15 రోజుల తర్వాత మళ్లీ అదే తరహా ఫోన్ రావటంతో రిటైర్డ్ ఉద్యోగి తన ఖాతా నుంచి వారికి రూ.49 లక్షలు నగదు బదిలీ చేశారు. ఆ తర్వాత మోసపోయిన సంగతి గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.
Read Entire Article