రాళ్లతో నిండిన రాయలసీమ ప్రాంతం డ్రోన్ల తయారీ సంస్థలకు నిలయంగా మారుతుందని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కర్నూలును డ్రోన్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డ్రోన్ సిటీలో వివిధ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తొలి దశలో 120 ఎకరాల్లో అభివృద్ధి చేశామని, రెండో దశలో 480 ఎకరాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఏపీఐఐసీ ఈడీ యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు.