ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వైఎస్ జగన్ షాక్ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్‌ను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించారనే ఆరోపణల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్‌ను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. అలాగే అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను నియమించారు.