తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి రావటానికి ప్రధానమైన కారణం.. ఆరు గ్యారెంటీల హామీ. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే.. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వగా.. ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినప్పటికీ ఇంకా అమలు చేయకపోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్‌లోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. ఆరు గ్యారెంటీలు బోగస్ అంటూ కామెంట్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.