బంగాళాఖాతంలో ఫెంగల్ తుపాను తీరం వైపు నెమ్మదిగా కదులుతోంది. శనివారం రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో నెమ్మదిగా కదులుతుందన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్.. తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అలాగే కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.