KTR Case Updates: తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఫార్ములా ఈ- రేసు కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా ఏసీబీ పేర్కొనగా.. ఈడీ కూడా రంగంలో దిగి నోటీసులు జారీ చేసింది. అయితే.. తనపై పెట్టిన కేసులు కొట్టేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా.. ఏసీబీ కౌంటర్ పిటిషన్ మీద స్పందిస్తూ.. అఫిడవిట్ సమర్పించారు. ఇందులో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.