మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్ సర్వీసులను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. మేఘా సంస్థ కార్పొరేట్ సోషల్ రెెస్పాన్సిబులిటీ కింద రెండు ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది. ఈ రెండు బస్సు సర్వీసులను మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రారంభించారు. ఒక బస్సును మంగళగిరి ఎయిమ్స్‌కు, మరో బస్సును లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకూ నడపనున్నారు. మరోవైపు గుంటూరు, మంగళగిరిలకు వంద ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించే ఆలోచనలో కేంద్రం ఉంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు.