Andhra Pradesh Free Bus Scheme for Women: ఏపీ మహిళలకు శుభవార్త. ఆగస్ట్ 15 నుంచి ఏపీలో ఉచిత బస్సు పథకం అమలు కానుంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎండీ ద్వారకా తిరుమలరావు బుధవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన ఆర్టీసీ ఛైర్మన్.. పథకానికి సంబంధించి పలు వివరాలు వెల్లడించారు. ఆగస్ట్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఉచిత బస్సు పథకం కోసం ఏయే గుర్తింపు కార్డులు కావాలి.. ఏయే బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామనే వివరాలను ఆర్టీసీ ఛైర్మన్ నారాయణ వివరించారు.