ఆంధ్రప్రదేశ్‌లో అక్కడ ఉచితంగా చికెన్ అందించారు. మీరు విన్నది నిజమే. తిన్నోళ్లకు తిన్నంత చికెన్ వంటకాలు, కోడిగుడ్లను అందించారు. అయితే ఇదంతా బర్డ్ ఫ్లూ వైరస్ గురించి అవగాహన కల్పించేందుకు చేపడుతున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి కారణంగా చికెన్ రేట్లు, కోడిగుడ్డు ధరలు భారీగా పతనమయ్యాయి. ప్రజలు చికెన్ తినడం తగ్గించడంతో ధరలు పతనమై పౌల్ట్రీ రంగం కుదేలవుతోంది. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో చికెన్ ఫుడ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచితంగా చికెన్ వంటకాలు అందించారు.