రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ఫీవర్ నడుస్తోంది. రామ్‌చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా జనవరి పదో తేదీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షో ప్రదర్శించేందుకు పర్మిషన్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. జనవరి 23 వరకూ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.