Gautam Adani: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదానీ గ్రూప్ భారీ విరాళం ప్రకటించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల ధాటికి విలవిలలాడిన ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేసేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రూ.25 కోట్లు ప్రకటించినట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుకు చెక్ అందిస్తున్న ఫోటోను అదానీ షేర్ చేశారు.