ఏపీలో గులియన్ బారీ సిండ్రోమ్ కలవరపెడుతోంది. జీబీఎస్ వ్యాధితో బాధపడుతూ మరో వ్యక్తి చనిపోయారు. గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో షేక్ గౌహర్ జాన్ అనే మహిళ జీబీఎస్‌తో బాధపడుతూ మృతి చెందారు. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ ఇటీవల చనిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు జీబీఎస్ గురించి ఆందోళన వద్దని ప్రభుత్వం చెప్తోంది. లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచిస్తోంది. ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.